పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఘర్షణలకు తాత్కాలిక ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హి
జ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధికారులు వెల్లడించారు. లెబనాన్‌లో ఉద్రిక్తతలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు సమాచారం. అయితే, సీజ్‌ఫైర్‌కు ముందు జరిగిన దాడుల్లో లెబనాన్‌లో 47 మంది, ఇజ్రాయెల్‌లో నలుగురు సైనికులు మరణించిన
ట్లు వార్తలు వస్తున్నాయి.