గాజా వినాశనమే ఇజ్రాయెల్ లక్ష్యం: ఖతార్
By BS Naidu 15445చూసినవారుగాజాను పూర్తిగా ధ్వంసం చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యమని ఖతార్ ఏమిర్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మండిపడ్డారు. హమస్ జైళ్లలోని బందీల గురించి ఆ దేశం పట్టించుకోవడం లేదన్నారు. హమాస్ కీలక నేతలే లక్ష్యంగా ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై దాడి చెపట్టిందన్నారు. గాజాలో ఇజ్రాయెల్ జాతి విధ్వంసానికి పాల్పడుతోందని అల్‌థానీ విమర్శించారు. నమ్మక ద్రోహానికి పాల్పడే దేశంతో చర్చలకు అవకాశం లేదన్నారు.