ఇరాన్‌తో అమెరికా చేస్తున్న దౌత్య ప్రయత్నాలకు తమ దేశం మద్దతు ఇస్తోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ తెలిపారు. అయితే, ఇరాన్ మరోసారి ముప్పుగా మారకుండా ఉండేందుకు తాము తిరిగి దాడులు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. టెహ్రాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కృషి చేస్తున్నారని, గత ఏడాది కాలంలో ఇరాన్ అన్ని రంగాల్లోనూ వెనకబడి తీవ్రంగా దెబ్బతిందని కట్జ్ చెప్పారు.