ఐక్యరాజ్యసమితి నివేదికలో గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడిందని బయటపడింది. అగ్రనాయకులు కూడా ఈ దాడులను ప్రోత్సహించారని పేర్కొంది. 72 పేజీల నివేదిక ప్రకారం, 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ నాలుగు జాతి విధ్వంసకర దాడులు చేసింది. అక్టోబర్ 7కి ముందే సరుకు రవాణా అడ్డుకుని, నీరు, ఆహారం, ఇంధనం, విద్యుత్, మానవతా సాయం నిలిపివేయడం ద్వారా గాజావాసుల జీవనాన్ని దుర్భరంగా మార్చిందని తెలిపింది.