ఇస్రో చైర్మన్ నారాయణన్ తన బృందంతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆనంద నిలయంలోకి వెళ్లి, జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-17, ఇఓఎస్- 05 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం జరగనుంది.