
జొమాటో డెలివరీ బాయ్‌కు ఊహించని పుట్టినరోజు కానుక!
ఫుడ్ డెలివరీ ఏజెంట్లు తమ రోజువారీ పనిలో భాగంగా ఎన్నో ఇళ్లకు వెళ్తుంటారు. అయితే, ఇటీవల ఒక జొమాటో డెలివరీ బాయ్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. కేక్ డెలివరీ చేయడానికి వెళ్లిన అతని బర్త్ డేను, కేక్ ఆర్డర్ చేసిన కుటుంబం తమ ఇంట్లోనే పుట్టినరోజు జరిపి ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు.




