AP: తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల వద్ద గురువారం నుంచి ఉచిత సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీ పునఃప్రారంభమైంది. నేడు టోకెన్లు పొందిన భక్తులకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. దీంతో SSD టోకెన్లపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.