KCRను కవిత తిడితే బాధ కలిగింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

2948చూసినవారు
KCRను కవిత తిడితే బాధ కలిగింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
TG: కేసీఆర్‌ను విమర్శించడం కవితకు మంచిది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను తిట్టడం బాధ కలిగించిందని, కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు అని ఆయన ప్రశ్నించారు. తండ్రినే గౌరవించని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎలా ఆదర్శమవుతారని, తొలి సభలోనే కేసీఆర్‌ను విమర్శించి కవిత మర్యాద కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. కవిత పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్