ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని, పరిశ్రమలను బలోపేతం చేసి పౌరులను శక్తిమంతం చేసేలా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమన్నారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీర్వాదం పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు, ఏపీ స్వాభిమాన సంస్కృతి, విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల కేంద్రమని పేర్కొన్నారు. స్వచ్ఛశక్తి నుంచి సంపూర్ణ శక్తి ఉత్పత్తి వరకు భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు.