తెలంగాణలో వర్షాలు కురవకపోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని జడ్చర్ల
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జడ్చర్లలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఈ వర్షాభావ పరిస్థితులతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ వర్షాలు కురవడం లేదని, దాని ప్రభావం వల్లే తెలంగాణలోనూ వర్షాలు పడటం లేదని ఆయన విచిత్రంగా పేర్కొన్నారు.