జీవిత భాగస్వామి ఆత్మహత్య చేసుకుంటానని పదే పదే బెదిరించడం క్రూరత్వమని, అలాంటి పరిస్థితుల్లో వైవాహిక సంబంధాన్ని కొనసాగించడం అసాధ్యమని బాంబే హైకోర్టు తెలిపింది. మహారాష్ట్రకు చెందిన దంపతులకు 2006లో వివాహమైంది. 2012 నుంచి వారు విడిగా ఉంటున్నారు. భార్య అనుమానించడంతోపాటు ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరిస్తున్నదని భర్త ఆరోపించగా, కుటుంబ కోర్టు విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం భర్తకు విడాకులు మంజూరు చేసింది. అయితే, భార్యకు రూ. 25 లక్షలు, రెండు ఫ్లాట్ల యాజమాన్యం బదిలీ చేయాలని ఆదేశించింది.