తెలంగాణలో పవన్‌ కల్యాణ్‌ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు: చంద్రబాబు

31చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ని తెలంగాణలో అడ్డుకోవడం కరెక్ట్ కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని, తాను కూడా తమిళనాడులో ప్రచారం చేశానని చంద్రబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలోనే పోటీ ఉండాలని ఆయన పేర్కొన్నారు. విభజన జరిగి ఇన్నేళ్లయినా ప్రాంతాల మధ్య అనవసర విద్వేషాలు రేపడం మంచి పద్ధతి కాదని, వ్యవస్థను చెడగొట్టకుండా లాజికల్‌గా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.

సంబంధిత పోస్ట్