అవమానపరిచేల మాట్లాడడం సరికాదు: రాంచందర్​రావు

30చూసినవారు
అవమానపరిచేల మాట్లాడడం సరికాదు: రాంచందర్​రావు
TG: ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రగతి పథంపై పరుగులు పెడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి మోదీ వస్తుండటంతో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలకాలని కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్‌లో 100 సీట్లలో ఓట్ చోరీ జరిగిందని మమత విమర్శలు చేస్తే దీనికి రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల తీర్పుని అంగీకరించాలి, ప్రజలను అవమానపరిచే మాటలు మాట్లాడడం మంచిది కాదని సూచించారు.

ట్యాగ్స్ :