TG: ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లెలో SLBC పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు 1983లో మంజూరైందని, అయితే ఇప్పటికీ పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు టన్నెల్ పనుల అంచనా విలువ రూ.1,968 కోట్లు అని తెలిపారు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఈ టన్నెల్ పనుల్లో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు.