
కాకినాడలో మొదలైన మొంథా తుఫాన్ ప్రభావం.. అల్లకల్లోలం (వీడియో)
AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వాన పడుతోంది. కాకినాడలో సోమవారం ఉదయం చిరుజల్లులు పడగా.. ఉ.10 గంటల తర్వాత వర్షం తీవ్రత పెరిగింది. ప్రస్తుతం మొంథా తుఫాన్ ప్రభావం మొదలైంది. భారీ ఈదురుగాలులతో వర్షం పడుతోంది. సముద్రం దగ్గర వాతావరణం అల్లకల్లోలంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.




