
పొరపాటున వేరే సెంటర్‌కి వెళ్లిన విద్యార్థినికి పోలీసుల సాయం (వీడియో)
AP: తల్లిదండ్రులు పొరపాటున వేరే పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడంతో కంగారుపడిన 10వ తరగతి విద్యార్థినికి పోలీసులు సాయం చేశారు. కణితి హైస్కూల్‌లో పరీక్ష రాయాల్సి ఉండగా.. గాజువాక పరీక్షా కేంద్రానికి వెళ్లిన విద్యార్థినిని ఇన్విజిలేటర్ హాల్‌టికెట్ పరిశీలించి వెనక్కి పంపారు. ఏడుస్తూ బయటకు వచ్చిన విద్యార్థినిని గుర్తించిన పోలీసులు, ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే కణితి రోడ్డు హైస్కూల్ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల చొరవతో విద్యార్థినికి పరీక్ష రాసే అవకాశం దక్కింది.




