ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ(91) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అర్మానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.