పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఇటలీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. చారిత్రక నగరం రోమ్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరసనకారులు పాలస్తీనా జెండాలతో రోడ్లపైకి వచ్చారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 60 మంది పోలీసులు గాయపడ్డారు. 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలస్తీనా గుర్తింపుపై ప్రధాని మెలోని వెనక్కి తగ్గడంతో నిరసనలు ఉధృతమయ్యాయి.