పటాస్, జబర్దస్త్ షోలతో గుర్తింపు పొందిన కమెడియన్ ప్రవీణ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతని భార్య కడెం వంశిత గర్భవతి అని, ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రవీణ్, వంశిత దంపతులకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఏడాది మేలో వీరి వివాహం జరిగింది. ప్రవీణ్ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తుండగా.. వంశిత నటిగా, డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.