
వంట కార్మికులను తొలగిస్తున్నారని ప్రచారం.. క్లారిటీ
AP: స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన వంట కార్మికులను తొలగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వంట కార్మికులను తొలగించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చింది. దశాబ్దాలుగా పాఠశాలల్లో సేవలు అందిస్తున్న దాదాపు 85 వేల మంది అక్కాచెల్లెమ్మల సేవలను ప్రభుత్వం పూర్తి గౌరవిస్తుందని పేర్కొంది.




