పులివెందులలో సోమవారం నుంచి మాజీ సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ పులివెందులలోని క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. మంగళవారం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించనున్నారు. అనంతరం లింగాల మండలం అంబకపల్లి వద్ద గంగమ్మ కుండ వద్ద జల హారతి కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ పాల్గొంటారు.