AP: తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బూత్ కమిటీల ఏర్పాటులో జాప్యం చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై సరైన నివేదికలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇకపై ఇలానే జరిగితే పనిచేయని వారిని పక్కన పెట్టి, పనిచేసే వారికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.