
హైదరాబాద్‌లో యూట్యూబర్ దారుణ హత్య
TG: హైదరాబాద్‌లోని గోల్కొండలో శుక్రవారం యూట్యూబర్ షేక్ మహబూబ్ దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రాడ్లతో దాడి చేయడంతో మహబూబ్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మహబూబ్ బావమరిది షేక్ సోహైల్, అతని అనుచరులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మహబూబ్‌కు, అత్తింటి వారికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఇది హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.




























