రైతు బజార్లో కౌన్సిలర్ భర్త హంగామా, కేసు నమోదు

1చూసినవారు
రైతు బజార్లో కౌన్సిలర్ భర్త హంగామా, కేసు నమోదు
జగిత్యాల పట్టణంలోని రైతు బజార్లో 22వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అరవ లక్ష్మిభర్త ఏసీఎస్ రాజు, వ్యాపారం చేస్తున్న ఓ వర్గం వారితో వాగ్వాదానికి దిగి, అసభ్య పదజాలంతో దూషించి, తమ వర్గం వారు ఇక్కడ వ్యాపారం చేయరాదని కేకలు వేస్తూ హంగామా సృష్టించినట్లు బాధితులు ఆరోపించారు. మద్యం మత్తులో లైసెన్సులు చెక్ చేయడానికి వచ్చానని దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. షేక్ మహమ్మద్ ఫిర్యాదు మేరకు ఏసీఎస్ రాజుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్