
ధర్మపురి: మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరండి
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి, మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం జరిగేలా కృషి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మాన సభకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మాదిగ ఉద్యోగులంతా వేలాదిగా తరలి రావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో గల శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.


































