ధర్మపురి: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

0చూసినవారు
ధర్మపురి: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
జిల్లాలో పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ధర్మపురి పోలీస్ స్టేషన్‌తో పాటు ధర్మపురి సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు వంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ తనిఖీలో వారి వెంట డిఎస్పీ పురుషోత్తం రెడ్డి కూడా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్