ధర్మపురి: రద్దీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు

2చూసినవారు
ధర్మపురి: రద్దీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు
జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ధర్మపురి పట్టణంలో గురువారం రాత్రి డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ తనిఖీలు నిర్వహించాయి. సి.ఐ రామ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ పాన్ షాపుల్లో గంజాయి పదార్థాలను గుర్తించేందుకు ప్రత్యేక జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ చర్యలు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్