ధర్మపురి: పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

0చూసినవారు
ధర్మపురి: పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ధర్మపురిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పుష్కరాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులు, పుష్కరాల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్