2027లో జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోరకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ప్రైవేట్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో గోదావరి తీరంలో మంత్రి పరిశీలించారు.