జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం వద్ద ఆదివారం, 28 జూన్ 2026న, 2వ వార్డు కౌన్సిలర్ సంగనభట్ల సంతోషి పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నారుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పోలియో రాకుండా వ్యాక్సిన్ వేస్తుందన్నారు. 0-5 సంవత్సరాల చిన్నారులకు మోతాదు ప్రకారం పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.