గొల్లపెల్లి మండల అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా తడగొండ విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా తాండ్ర కిరణ్, సంగేమ్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శిగా మద్దూరి నవీన్, కార్యదర్శిగా చెవులమద్ది సంతోష్ ఎన్నికయ్యారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని విజయవంతంగా నిర్వహిస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.