ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు మాజీ సింగిల్ విండో చైర్మన్ కర్ర విక్రమ్ రెడ్డి. బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామానికి చెందిన మ్యాకల మమత తల్లి మ్యాకల మల్లమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కర్ర విక్రమ్ రెడ్డి మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబానికి తన వంతు సహాయంగా రూ. 5, 000 ఆర్థిక సాయాన్ని అందించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వంతో స్పందించిన కర్ర విక్రమ్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.