జగిత్యాల జిల్లా, ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం
జగన్ కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. ఇటీవల మరణించిన
జగన్ చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబాన్నిఆదివారం పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తరఫున రూ. 10 లక్షలు, నియోజకవర్గ నాయకుల తరఫున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ. 2 లక్షలు అందించారు. మొత్తం రూ. 21.6 లక్షల విలువైన చెక్కును కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు.