జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన అండర్ 17 ఖోఖో, వాలీబాల్ పోటీలు, నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో నంచర్ల గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
విద్యార్థులు అండర్ -17 ఖోఖో మండల స్థాయి క్రీడలో ప్రథమ స్థానంలో, వాలీబాల్ పోటీల్లో బాలురు ప్రథమ స్థానంలో గెలుపొంది ప్రభుత్వ పాఠశాలల ఔన్నత్యాన్ని నవ సమాజ నిర్మాణానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన వీరి విజయం వెనుక ప్రధానోపాధ్యాయురాలు శారద ఉన్నారు.