ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి: సర్పంచ్

455చూసినవారు
ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి: సర్పంచ్
జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాందేనీమొగిలి మాట్లాడుతూ, ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో రాకుండా తల్లిదండ్రులు రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్