పీవీ నరసింహారావుకు రేవంత్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ ఘన నివాళి

455చూసినవారు
పీవీ నరసింహారావుకు రేవంత్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ ఘన నివాళి
జగిత్యాల జిల్లా, ధర్మపురిలో భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా నిర్వహించిన నివాళి కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఆర్థిక సంస్కరణలకు పునాదివేసి భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానేత పీవీ నరసింహారావు సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్