
ఫేస్ బుక్ వాడుతోందని.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
బిహార్‌లోని ఎరారి కంచన్‌పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫేస్ బుక్ వాడుతుందని భార్యను గొడ్డలితో నరికి చంపాడు భర్త. అభిషేక్ కుమార్, దివ్యా కుమారి(27) భార్యాభర్తలు. అక్టోబర్ 30న దివ్యా ఫేస్ బుక్‌లో చాట్ చేస్తుండగా.. భర్త వ్యతిరేకించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అనుమానం, కోపంతో రాత్రి మరోసారి గొడవ జరిగి.. ఆవేశంలో చివరకు గొడ్డలితో నరికి చంపాడు. మృతురాలి తండ్రి మనోజ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.




