
భార్య న్యూడ్ వీడియో వైరల్ చేస్తానని బెదిరించిన భర్త.. 10 లక్షల డిమాండ్
యూపీ గోరఖ్‌పూర్‌లో ప్రియురాలి మోజులోపడిన భర్త భార్యను బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె న్యూడ్ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఒకవేళ అలా చేయకూడదంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులుకు ఫిర్యాదు చేసిన భార్య, సీతాపూర్ జిల్లాలోని కంపెనీలో తన భర్త పనిచేస్తున్నాడని, అక్కడే సహోద్యోగినితో సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. అదనపు కట్నం పేరుతో డబ్బులు తెమ్మని భర్తతో పాటు అత్తమామలూ వేధిస్తున్నారని చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.




