Feb 09, 2026, 00:02 IST/
యూపీలో బాలికలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి (వీడియో)
Feb 09, 2026, 00:02 IST
ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లాలో ఆదివారం నిర్మాణంలో ఉన్న గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు తొమ్మిది మంది బాలికలపైకి దూసుకెళ్లడంతో నలుగురు బాలికలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా సామూహిక విందులో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.