May 14, 2026, 16:05 IST/
బంగారం కోసం చేతులు, కాళ్లు కట్టేసి.. మహిళను హత్య చేసిన దుండగులు
May 14, 2026, 16:05 IST
AP: విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలెం పరిధిలో శ్రీనివాసనగర్‌లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి, బీరువా తాళాల కోసం చిత్రహింసలు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారమే హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన పార్వతిని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.