Dec 10, 2025, 13:12 IST/
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
Dec 10, 2025, 13:12 IST
TG: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చన్నాయపాలెంకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ భుక్య జ్యోతి అశోక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు, సంగారెడ్డి జిల్లాలో 20 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.