రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో 'ఐ క్యు మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ' పేరుతో కుట్టు మెషీన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి వసూలు చేశారు. 100 రోజుల్లో మెషీన్లు అందజేస్తామని, లేదంటే డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, గడువు ముగిసినా మెషీన్లు ఇవ్వకపోవడంతో మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.