
నడి రోడ్డుపై యువకుడు వీరంగం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ యువకుడు నడి రోడ్డుపై హల్చల్ చేశాడు. వాహనాలను అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువకుడు వాహనదారులపై దాడికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. ఈ సంఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. యువకుడు నరసాపురం జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.




