రైతు పండించిన పంటను కొనేవాళ్లు లేరంటూ ఓ రైతు పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగిత్యాల జిల్లా సర్వాపూర్ గ్రామంలో ఓ రైతు ధాన్యం కుప్పలను చూపిస్తూ పాటను ఆలపించిన తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘రైతుగా పుట్టాను, రైతుగానే పెరిగాను.
రాజకీయం నేను చేస్తే రంది(ఏ బాధ) లేకుండా ఉందునయ్యా. ఆరు నెలల కష్టంలో 66 గోసలు పడి పండించిన పంటను కొనేవారే లేరయ్యా. రైతు బతుకు చూడరో’ అంటూ ఆ రైతు పాడిన పాట ఆలోచింప చేస్తోంది.