
కాశీబుగ్గలో తొక్కిసలాట.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏకాదశి రోజున జరిగిన తొక్కిసలాటలో 9 మందికి పైగా భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేశ్, అనిత, ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణకు హోంమంత్రి అనిత ఆదేశించారు.




