అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

0చూసినవారు
అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ మహేశ్వరి మంగళవారం తెలిపారు. పెగడపల్లి, రాములపల్లి, నరసింహునిపేట గ్రామాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్థానిక మహిళలు, ఇంటర్ విద్యార్హతతో 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు వారు ఈ నెల 7 నుండి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్