జగిత్యాలలోని అంగడి బజార్లో తెలంగాణ ఉద్యమ యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు నందయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని సమిండ్ల వాణి తెలిపారు. ఒక బీసీ బిడ్డగా, పదవిలో ఉన్నంతకాలం బీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే సంజయ్ సహకారంతో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.