జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండల
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం, బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో విశిష్ట నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.