భగత్ సింగ్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని తహసిల్ చౌరస్తా సమీపంలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి
భారత్ సురక్షా సమితి నాయకులు పూలమాలలు సమర్పించి సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక కరీంనగర్ విభాగ సంయోజక్ చిట్ల గంగాధర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అక్కినపల్లి కాశీనాథం మాట్లాడుతూ భగత్ సింగ్ ధైర్యానికి, దేశభక్తికి ప్రతిరూపమని, యువతరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భగత్ సింగ్ దేశభక్తి కలిగిన విప్లవ వీరుల కుటుంబంలో జన్మించారని తెలిపారు.