గురువారం ఉదయం బీర్పూర్ మండల కేంద్రంలో కొల్లూరి మల్లేశం అనే రైతుకు చెందిన గేదె విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కంచెకు తగిలి మృతి చెందింది. ఈ సంఘటనపై విద్యుత్ ఏఈ శ్రీనివాస్, లైన్‌మెన్ సతీష్, అసిస్టెంట్ లైన్‌మెన్ శేకర్, సర్పంచ్ ఎలమట్ల హరీష్, ఉప సర్పంచ్ జితేందర్, వార్డు సభ్యులు మల్లేశం, భూమేష్, సుబాస్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.